సాధారణంగా శాస్త్రీయత, హేతుబద్ధత పట్ల సాధారణ ప్రజల నుండి ఉన్నత విద్యావంతుల వరకూ దాదాపుగా అందరికీ సానుకూల ద్రుక్పధమే ఉంటుంది. కానీ బాబు గోగినేని అనగానే అందరిలో ఒక జుగుప్స ఎందుకు కలగడం మొదలయింది?
మొదట్లో, టీవీ ఛానళ్ళలో అతని వాక్పఠిమని చూసి ప్రజల్లో కొంత ఉత్సుకత ఉండేది. కానీ తర్వాత్తర్వాత, బిగ్బాస్ మొదలు, జనాల మదిలో అతని ఇమేజ్ పతనం కాసాగింది. దీనికి ఈ కింది విషయాలు కారణాలుగా చెప్పవచ్చు.
1. డబ్బుల కోసం, మరింత గుర్తింపు కోసం ఆశపడి పాల్గొన్నా, ఏదో హేతువాదాన్ని ఉద్ధరించడానికన్నట్టు అతను చేసిన కవరింగ్
2. బిగ్బాస్ లొ అతను వేసిన చవకబారు వేషాలు, ఓటమిని జీర్ణించుకోలేనటువంటి అతని పరిణితి లేని తత్వం
3. డిబేట్లు ఏర్పాటు చేయించుకోని మరీ తానే అసలు విజేతనని నిరూపించుకోవడానికి అతను పడిన పాట్లు
4. రాజమౌళి, ఆర్జీవీ, పవన్ కళ్యాణ్, తనికెళ్ళ భరణి, జగపతి బాబు తదితరుల పట్ల అతని అవసరం లేని వివాదాస్పత వ్యాఖ్యలు
5. సామాజిక మాధ్యమాలలో అతనూ, అతని పెంపుడు కుక్కలూ వేసే చిల్లర వేషాలూ
6. తన ప్రత్యర్దులు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఇసుమంతయినా ఇంగితం, పరిణితి, మానవత్వం లేకుండా అతను చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలు
7. ఫేస్బుక్ మాటున అతని బూతు పురాణాలూ, కామెంట్లు లాక్ చేసి, మాటిమాటికీ మార్చి అతనూ, అతని పెంపుడు కుక్కలూ వేసే వేషాలు, పిరికిపంద చర్యలూ
8. ఫేస్బుక్ లొ ఎదో మూల ఎవరో తనకు రుచించని కామెంట్లు చేశారని, వారిని ఎగతాళి చేస్తూ, బూతులు తిడుతూ, వారి ఫొటొలు పోస్ట్ చేసి, అతనూ అతని పెంపుడు కుక్కలు పొందే శునకానందం
9. తన చిల్లర, పిరికిపంద వేషాలను వేలెత్తి చూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తానని అతను చేసే బెదిరింపులూ
10. ఎప్పుడో తనతో డిబేట్లొ ఓడిన వారిపై, బిగ్బాస్ హవుస్మేట్స్ పై మాటిమాటికీ అసభ్యకర కామెంట్లు చెయ్యడం, పోస్టులు/ఫోటోలు పెట్టడం
11. వ్యక్తిగత ధూషణలకు దిగి, అదేదొ దేశాన్ని ఉద్దరించామన్నట్టు అతనూ, అతని కుక్కల మందా చేసే దిగజారుడు పనులూ
ఇతను వేసే వేషాలు ప్రజలకు ఇంత జుగుప్స కలిగించినా కొన్ని టీవీ చానళ్ళు ఈ దగుల్భాజీకి ఇంకా కవరేజి ఇస్తుండడం, అతనితో ఇంకా ఇంటర్వూలూ, డిబేట్లూ ఏర్పాటు చెయ్యటం విడ్డూరం.
ఇతని ఆలొచనా విధానం ఎంత విచిత్రంగా వుందో ఈ మధ్య జరిగిన ఒక విషయంలో మనకు అర్ధం అవుతుంది. ఆనందయ్య మందు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత నటుడు జగపతి బాబు ఆయుర్వేదం అంటే తనకూ మంచి అభిప్రాయం ఉందనీ, దాని వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వ్యాఖ్యలు చేసాడు. అది జరిగిన కొన్ని రోజులకి తనకి ఆయుర్వేద ఆహార/ఔషధ వ్యాపారంలో ఆసక్తి ఉందనే ఉద్దేశం వ్యక్తపరిచినట్టు భోగట్టా. దీనిపై బాబు గోగినేని అసభ్యకరమైన వ్యాఖ్యలూ, పోస్టులూ చేసాడు. కానీ, ఒక అంశంపై నమ్మకం/ఆసక్తీ ఉంటేనే కదా ఎవరైనా ఆ వ్యాపారంలొ దిగేది! ఈ చిన్న లాజిక్ మిస్స్ అయ్యాడు మన లేకి మాటల/వంకర చేష్టల గోగినేని! ఆయుర్వేదం కి మద్దతుగా జగపతి బాబు వ్యాఖ్యలు చెయ్యడంలో తప్పేం ఉంది? చేసినంత మాత్రాన ఏ మాటంటే ఆ మాట అనవచ్చా?
హేతువాదం, మానవవాదం ముసుగులో అతను ఎంత జాగ్రత్తపడ్డా, అతని స్వంత అజెండా జాగ్రత్తగా గమనించే వారికి తేటతెల్లమే!
1. అప్పుడప్పుడూ నర్మగర్భంగా కాంగ్రెస్స్ కి, రాహుల్ గాంధీకి అనుకూలంగా అతను వదిలే వ్యాఖ్యలూ
2. LGBT హక్కుల మాటున, హేతువాదం ముసుగులో హిందూయిజం పై అతను చేసే దాడులూ
3. ఆస్త్రేలియా లొ ఉంటూ, ఫేస్బుక్ మాటున భారత దేశం పై, మన ఆచార వ్యవహారాల పై అతను చేసే దాడులూ
4. కేసులకి, ప్రజల ఆగ్రహానికీ భయపడి పారిపోయిన తీరూ
5. బయట పెట్టని ఆదాయ వనరుల విషయాల లోగుట్టూ
6. ప్రజల కళ్ళలో పడి, ఒక ఒపీనియన్ మేకర్ గా ఎదిగి తన స్వంత ఎజెండా అమలు చేద్దామని అతను చేసే విఫల ప్రయత్నాలూ
7. మన సంస్క్రుతినీ, ఆచార వ్యవహారాలనూ హేళన చేసి, చులకన చేసి, మన ఆత్మాభిమానం పై దొంగ దెబ్బ తీయడానికి అతను వేసే ఎత్తులూ
8. శాఖాహారులని ఎగతాళి చెయ్యడం, మాంసాహారాన్ని ప్రోత్సహించడం
ఎప్పుడూ హిందూయిజాన్ని, అప్పుడప్పుడూ జీసస్ నీ, అల్లా నీ ఎగతాళి చేస్తే సెక్యురలిస్టులు అవ్వరు! మనోభావాలు గాయపడిన వాళ్ళు ఎక్కువవుతారు అంతే . ఎవరి విశ్వాసాలు/నమ్మకాలు వారికి అపురూపం. కొన్నిటిని అలా వదిలెయ్యాలంతే.
కత్తి పట్టుకు వస్తా! నేను పట్టించుకుంటే జీవితాంతం గుర్తుంచుకుంటారు! ఇవీ, ఈ దగుల్బాజీ లేటెస్ట్ ప్రగల్భాలు! ఇంత వయలెన్స్ ఏంటి మాటల్లో? ఫేస్బుక్ మాటున కామెంట్లు చేసి/పోస్టులు పెట్టి దేశాన్ని ఉద్ధరిద్ధామనే? ఏంటీ పిచ్చి? ఎంత కాలం ఈ వెర్రి వేషాలు భరించడం?
ఇలా ఎవరిని పడితే వారిని, ఏ మాటంటే ఆ మాట అనే హక్కు బాబు గోగొనేనికి ఎవరిచ్చారు? ఫేస్బుక్ మాటున ఈ దగుల్బాజి చేసే వికౄతమైన పనులనూ/వ్యాఖ్యలనూ పట్టించుకోకుండా అతనితో డిబేట్లూ, ఇంటర్వూలూ చేస్తున్న టీవీ చానళ్ళను ఏం అనాలి?
అల్లోపతి తప్ప ఇంక ఏ విధానాల గురించీ ఇంక ఎవరూ మాట్లాడ కూడదా? మాట్లాడితే వాక్సిన్ హెసిటెన్సీని ప్రొత్సహిస్తున్నట్టూ, యాంటీ వాక్సరూనా? చదువుకున్న యువకులు కూడా ఈ దగుల్బాజీ చుట్టూ చేరి పెంపుడు కుక్కలలా ప్రవర్తిస్తూ, మాబ్ మెంటాలిటీ లో పడి కొట్టుకుపోతూ ఏదో దేశాన్ని ఉద్దరిస్తున్నామని భ్రమ పడడం విషాదకరం.
-- written by
Amarendra Reddy Sagila