Sunday, December 03, 2023

End of KCR's Rule in Telangana

 కేసీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు కానీ, ఈ కొన్ని విషయాల్లో చాలా సమర్ధవంతంగా వ్యవహరించాడు అని అనగలను:

- ఆంధ్రా సెటిలర్లకు ఎటువంటి భయం లేకుండా, విధ్వేషాలకు తావు లేకుండా చెయ్యడం
- కరెంట్ సమస్యను తక్కువ వ్యవధిలో పరిష్కరించడం
- అన్నల ప్రాబల్యం మళ్ళీ పెరగకుండా కంట్రోల్ చెయ్యడం
- హైదరాబాద్ లో ఐటీ మరియు ఇతర పెట్టుబడుల ప్రోత్సాహాన్ని కొనసాగించడం (ఇది కేటీఆర్ ఖాతాలోకి వెళ్తుంది)
- మిష్షన్ కాకతీయ, మిష్షన్ భగీరథ
- తెలంగాణ భూముల రేట్లు పెరిగేలా చెయ్యడం
.
అసలు నచ్చనివి ఇవి:
- యాదగిరిగుట్ట గుడి స్తంభాలపై తన ప్రతిమలను చెక్కించడం
- వాస్తు కారణంగా వేల కోట్ల ప్రజా ధనాన్ని కొత్త అసెంబ్లీ, సెక్రటేరియెట్ ల నిర్మాణానికి వెచ్చించడం
- ఎకరాకు నీళ్ళు అందించాలంటే లక్షలు వెచ్చించాల్సి వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట వేల కోట్ల ప్రజా ధనాన్ని వ్యర్ధంగా ధారపోయడం
- కుటుంబ పాలన
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ప్రాబల్యాన్ని పెద్దది చెయ్యడం
- ప్రభుత్యోద్యొగాల పరీక్షలను అత్యంత అసమర్ధంగా నిర్వహించడం
- ప్రజాకర్షక పధకాల పేరిట వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యడం
- ఎన్నికల్లో లాభం పొందటం కోసం కొన్ని వర్గాలకు ప్రజా ధనాన్ని ధారపోయడం
- నియంతలా వ్యవహరించడం, వార్తా పత్రికల, విమర్శకుల నోళ్ళు నొక్కడం
- ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలని చూడడం
.
పై విషయాల్లో వ్యతిరేకత ఉన్నా, ప్రస్తుతానికి బీ.ఆర్.ఎస్ గెలవడమే తెలంగాణాకి మంచిదని నమ్మాను. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అయ్యే ప్రమాదం ఉంది. పదేళ్ళు వెనక్కి వెళ్ళే ప్రమాదమూ ఉంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తును నాశనం చేసే పాత పెన్షన్ విధానాన్ని తేవాలని కాంగ్రెస్ చూడడం అత్యంత దురదౄష్టకరం.

No comments: