భారత దేశంలో పౌర హక్కులు, స్వేచ్చ మెండు గానూ, ఆర్ధిక హక్కులు చాల తక్కువగానూ ఉండేవని మొన్నటి దాకా అందరూ అంగీకరించిన విషయం. సింగపూర్ లాంటి దేశాల్లో అది రివర్స్! అక్కడ పౌర హక్కులు లుప్తం, గానీ ఆర్ధిక రంగంలో వెసులుబాటు చాలా మెరుగు. తూర్పు ఆసియా దేశాలు మనల్ని వెనక్కి నెట్టి చాలా ముందుకు పోవడానికి ఈ ఆర్ధిక స్వేచ్చే కారణం.
వ్యాపారం చెయ్యాలంటే అలవికాని నియంత్రణలు అలానే ఉండగా, భయంకరమైన టాక్సులు మన నడ్డి విరగగొడుతున్నాయి. అనేక రంగాల్లో ప్రభుత్వ జోక్యం విపరీతం. ఎగుమతులు చెయ్యలన్నా, దిగుమతులు చేసుకోవాలన్నా ప్రభుత్వం విధించే సుంకాలూ, ఆంక్షలూ తట్టుకోవాలి.
పౌర స్వేచ్చ విషయానికి వస్తే, సినిమాకి వెళ్తే జనగణమన నించుని పాడి డేశభక్తి నిరూపించుకోవాలి! గొడ్డు మాంసం మీద అంక్షలతో మొదలయ్యి, మెల్లగా ఏ మాంసం తినాలన్నా ఆంక్షల దిశగా వెళుతున్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలు పాలవ్వాలి, యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే బుల్డోజర్తో ఇల్లు కూలుతుంది. యువకులు పార్కుల్లో ప్రేమికులతో తిరిగితే పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్నెట్ యాక్టివిటీపై నిఘా ఎక్కువయ్యింది.
పౌర హక్కులు తగ్గుతుంటే మరి ప్రజల్లో ఎందుకు నిరసన గట్టిగా వినిపించట్లేదు? ఒక్కక్క విషయంలో వారి-వారి సామాజిక మూలాలను బట్టి ఎవరికి వారు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మైనార్టీల ఆర్ధిక/సామాజిక జీవనంపై దాడి జరుగుతోంది. మెజారిటీ వర్గానికి ఇంకా అంత చురుకు తగల్లేదు.
మొత్తానికి, రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం! ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం!
No comments:
Post a Comment